దుబాయ్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్

దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గురువారం దుబాయ్ చేరుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్–13 కోసం ఆదివారమే డీసీ జట్టు ఇక్కడికి రాగా పాంటింగ్ ఆలస్యంగా జట్టుతో కలిశాడు. నిబంధనల ప్రకారం అతను ఆరు రోజుల క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. తనకు కేటాయించిన హోటల్ గదికి చేరుకున్న పాంటింగ్ ఆరు రోజుల అధికారిక క్వారంటైన్ ప్రారంభమైందంటూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను మన్కడింగ్ చేయనివ్వబోనని వ్యాఖ్యానించి రికీ తాజాగా భారీ చర్చకు తావిచ్చాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి