
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో వార్నర్ మరో 55 పరుగులు సాధిస్తే ఒకే ప్రాంఛైజీ పై 1000 పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కతాడు. పంజాబ్‌పై ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 945 పరుగులు సాధించాడు.
కాగా అంతకుముందు ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ గతంలో కేకేఆర్‌పై 1000 పరుగులు సాధించాడు. అదే విధంగా వార్నర్ టీ20 క్రికెట్‌లో 10,500 పరుగుల మైలు చేరుకోవడానికి కేవలం 61 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. బ్రబౌర్న్ వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.