IPL 2022: సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన నేచురల్ స్టార్ నాని | Chat Between Washington Sundar And Nani Goes Viral | Sakshi
Sakshi News home page

Nani Wishes Sundar: సుందర్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సుందరం.. ఎందుకంటే..!

Mar 19 2022 8:13 PM | Updated on Mar 23 2022 6:32 PM

Chat Between Washington Sundar And Nani Goes Viral - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలుండటంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీ అయిపోగా, ఆయా ఫ్రాంచైజీలు సోషల్ మీడియా ప్రమోషన్స్‌తో హడావుడి షురూ చేశాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్‌తో అనునిత్యం టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌.. ప్రముఖ​ టాలీవుడ్‌ హీరో, నేచురల్‌ స్టార్‌ నానిని, తమ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో లింక్‌ చేస్తూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేసింది. 


నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా జూన్ 10న విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో.. ‘అంటే ఆ సుందరం జూన్‌లో వస్తాడు, ఈ సుందర్ ఆల్‌రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు..’ అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ఇందుకు నేచురల్ స్టార్ నాని స్పందించాడు. ‘ఆల్ ది బెస్ట్ సుందర్, ఫ్రం సుందర్..’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ‘వచ్చాను గయ్స్’ అంటూ ట్వీటాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.


ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలంలో సన్‌రైజర్స్.. వాషింగ్టన్‌ సుందర్‌ను ఏకంగా రూ.8.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్‌ వరకు ఆర్సీబీకి ఆడిన సుందర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వేలంలో పట్టుబట్టి మరీ సొంతం చేసుకుంది. కాగా, మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్‌లో సన్‌‌రైజర్స్.. తన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ మార్చి 29వ తేదీన జరగనుంది. చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది.


చదవండి: కళావతి సాంగ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడి స్టెప్పులు.. నీకంత సీన్‌ లేదులే! అయినా

Advertisement
 
Advertisement
Advertisement