భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌లు.. | Sakshi
Sakshi News home page

IND Vs AUS 3rd T20: భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌లు..

Published Sun, Sep 25 2022 4:57 PM

Bettings on India vs Australia 3rd T20 betting - Sakshi

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మూడో టీ20 హైదరాబాద్‌గా ఆదివారం జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌-ఆసీస్‌ జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. సిరీస్‌ డిసైడ్‌ మ్యాచ్‌లో తలపడేందకు ఇరు జట్లు ఊ‍వ్విళ్లూరుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.

మరోవైపు ఈ కీలక మ్యాచ్‌పై భారీ బెట్టింగ్‌ జరుగుతోంది. బాల్‌ టూ బాల్‌, ప్రతీ రన్‌కు, వికెట్‌కు బుకీలు బెట్టింగ్‌ ‍కడుతున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తుందని భారీగా బెట్టింగ్‌లు పెడుతున్నారు రూ.వెయ్యి నుంచి రూ. లక్ష వరకు బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం.

బుకీలు,మినీ బుకీలుగా రెండు రకాలుగా బెట్టింగులు జరుగుతున్నాయి. అధే విదంగా ఆన్‌లైన్‌లో లక్షల మంది బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ రాయళ్లపై ఎస్‌వోటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
చదవండిIND Vs AUS 3rd T20: ఉప్పల్‌ 'దంగల్‌'.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Advertisement
 
Advertisement
 
Advertisement