Australian Open 2022: Ashleigh Barty Reached Finals, Creates Record - Sakshi
Sakshi News home page

Australian Open- Ashleigh Barty: ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆష్లే బార్టీ.. సరికొత్త చరిత్ర

Jan 27 2022 5:14 PM | Updated on Jan 27 2022 7:27 PM

Australian Open 2022: Ashleigh Barty Defeat Madison Keys Enter Final New Record - Sakshi

PC: Australian Open

Australian Open: సరికొత్త చరిత్ర సృష్టించిన ఆష్లే బార్టీ

Ashleigh Barty dismantles Madison Keys: ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ ఆష్లే బార్టీ అద్భుత విజయం సాధించింది. అమెరికన్‌ ప్లేయర్‌ మేడిసన్‌ కీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. 1980 తర్వాత మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా నిలిచింది. 

ఇక వరల్డ్‌ నెంబర్‌ 1 ఆష్లే.. మేడిసన్‌ను 6-1, 6-3 తేడాతో మట్టికరిపించి టైటిల్‌ రేసులోకి దూసుకువెళ్లింది. ఫైనల్‌లో ఆమె.. ఏడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) లేదంటే... 27వ సీడ్‌ డానియల్‌ కొలిన్స్‌ (అమెరికా)తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్‌లో గెలిస్తే ఆష్లే కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేరుతుంది. కాగా 1980లో వెండీ టర్న్‌బల్‌ తొలిసారిగా మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది.  ఇప్పుడు ఆష్లే ఆ రికార్డును సవరించింది.

చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్‌ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్‌ తివారి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement