ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌కు జైలు శిక్ష..! | Australian Cricketer Faces Jail For Child Abuse At A School | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌కు జైలు శిక్ష..!

Jul 3 2026 10:30 AM | Updated on Jul 3 2026 10:38 AM

Australian Cricketer Faces Jail For Child Abuse At A School

మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ ఆరోన్‌ సమ్మర్స్‌కు జైలు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది. 2018లో నమోదైన ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్‌ త్వరలో రాబోతుంది. ఈ కేసులో ఆరోన్‌ నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసు టాస్మానియా సుప్రీం కోర్టులో శిక్ష ఖరారు దశలో కొనసాగుతోంది.

2018లో ఆరోన్‌ హోబార్ట్‌లో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా బాలికతో పరిచయం ఏర్పరుచుకున్న అతడు.. ఓ పాఠశాల ప్రాంగణంలో లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు వివరాలు చెబుతున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అరోన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్‌కు ఆడుతున్నాడు.

ఆరోన్‌పై గతంలోనూ మైనర్లపై లైంగిక దాడుల కేసుల్లో చాలా ఆరోపణలు ఉన్నాయి. చాన్నాళ్ల కాలంపాటు అతడు బెయిల్‌పైనే ఉన్నాడు. 2020లో ఆరోన్‌ పాకిస్తాన్‌ దేశవాలీ క్రికెట్‌ కూడా ఆడాడు. తద్వారా పాక్‌లో దేశవాలీ క్రికెట్‌ ఆడిన తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డుల్లోకెక్కాడు.

30 ఏళ్ల ఆరోన్‌ ఒకప్పుడు ప్రతిభావంతమైన ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అతడు ఆసీస్‌ జాతీయ జట్టులోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. ఈ దశలో అతడు నేరాలకు పాల్పడుతూ కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. ఆరోన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌తో పాటు యూరో టీ20 స్లామ్‌ తదితర విదేశీ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement