
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 ఛాంపియన్స్‌గా ఆసియా లయన్స్ నిలిచింది. దోహా వేదికగా జరిగిన ఫైనల్‌లో వరల్డ్ జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో ఆసియా లయన్స్ చిత్తు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్.. కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1ఓవర్లలోనే ఛేదించింది. ఆసియా బ్యాటర్లలో ఓపెనర్లు ఉపుల్ తరంగ(28 బంతుల్లో 57 పరుగులు), తిలకరత్నే దిల్షాన్(58) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.
తరంగ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం మిస్బా-ఉల్-హక్(9), మహమ్మద్ హఫీజ్(9) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది.
వరల్డ్ జెయింట్స్ బ్యాటర్లలో జాక్వెస్ కల్లిస్(54 బంతుల్లో 78 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు రాస్ టేలర్(32) పరుగులతో రాణించాడు. ఆసియా బౌలర్లలో స్పిన్నర్ రజాక్ రెండు వికెట్లు సాధించగా.. పెరీరా ఒక్క వికెట్ పడగొట్టాడు.
చదవండి: Indian Wells: ‘నంబర్‌వన్’ అల్‌కరాజ్.. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సొంతం