Sebastian Vettel Retirement: ఆటగాళ్లతో గొడవ.. ఎఫ్‌ 1 మునుపటిలా లేదు.. అందుకే

4-Time Champion Sebastian Vettel Retire Formula 1 At End Of 2022 Season - Sakshi

ఫార్ములావన్‌ దిగ్గజం.. నాలుగుసార్లు చాంపియన్‌ జర్మనీ రేసర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2022 సీజన్‌ అనంతరం ఫార్ములావన్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నట్లు గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.  అయితే సెబాస్టియన్‌ వెటెల్‌ అనూహ్య నిర్ణయం వెనుక ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఆస్ట్రియా గ్రాండ్ ప్రి సందర్భంగా రేసింగ్ స్టీవర్డ్స్తో గొడవ పడ్డాడు. ప్రస్తుతం ఎఫ్ 1 రేసింగ్ మునపటిలా లేదనే భావనను వ్యక్తం చేశాడు. అందుకే ఇలా అనూహ్య రిటైర్‌మెంట్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సెబాస్టియన్ వెటెల్ ఆస్టన్ మార్టిన్ జట్టు తరఫున 2022 ఫార్ములా వన్ సీజన్ లో రేసింగ్ చేస్తున్నాడు. 2007లో బీఎండబ్ల్యూ తరఫున సెబాస్టియన్ వెటెల్ ఫార్ములా వన్ లో అరంగేట్రం చేశాడు. 2008లో రెడ్ బుల్ సిస్టర్ టీం అయిన టొరొ రాసో (ఇప్పటి ఆల్ఫా టారీ) తరఫున బరిలోకి దిగాడు. మిడ్ ఫీల్డ్ టీం అయిన టొరొ రాసో తరఫున 2008లో జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విజయం సాధించి సంచలనం నమోదు చేశాడు. అనంతరం 2009 నుంచి 2014 వరకు రెడ్ బుల్ తరఫున రేసింగ్ చేశాడు. ఈ క్రమంలో వరుసగా 2010, 2011, 2012, 2013లలో ఫార్ములా వన్ డ్రైవర్ చాంపియన్‌గా నిలిచాడు.


2010, 2012లో ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలొన్సో నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నా.. 2011, 2013 ఫార్ములా వన్ సీజన్ లలో అలవోకగా చాంపియన్ షిప్ ను సొంతం చేసుకున్నాడు. భారత్ వేదికగా ఇండియన్ గ్రాండ్ ప్రి మూడు ( 2011, 2012, 2013) పర్యాయాలు జరగ్గా.. ఆ మూడు సార్లు కూడా వెటెల్ విజేతగా నిలువడం విశేషం. అనంతరం 2015లో ఫెరారీకి మారిన అతడు ఆ ఏడాది నుంచి 2020 వరకు ఆ జట్టుతోనే కొనసాగాడు. 2021 నుంచి ఆస్టన్ మార్టిన్ తరఫున రేసింగ్ లో పాల్గొంటున్నాడు. సెబాస్టియన్‌ తన కెరీర్ లో ఇప్పటి వరకు 290 రేసుల్లో 53 విజయాలు సాధించాడు. మరో 57 సార్లు పోల్ పొజిషన్ ను అందుకున్నాడు.

చదవండి: చెస్‌ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top