బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ | Sebastian Vettel wins British Grand Prix to extend championship lead over Lewis Hamilton | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌

Jul 9 2018 4:00 AM | Updated on Aug 21 2018 9:00 PM

Sebastian Vettel wins British Grand Prix to extend championship lead over Lewis Hamilton - Sakshi

ఫెరారీ జట్టు డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో విజేతగా నిలిచాడు. సిల్వర్‌స్టోన్‌లో ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్‌ గంటా 27 నిమిషాల 29.784 సెకన్లలో ముగించాడు. ఈ సీజన్‌లో వెటెల్‌కిది నాలుగో విజయం. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ హామిల్టన్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్‌ ఏడో స్థానంలో, పెరెజ్‌ 11వ స్థానంలో నిలిచారు. 

Advertisement
 
Advertisement
Advertisement