105 Years Old Woman New Record: 100 మీటర్ల రేసులో 105 ఏళ్ల బామ్మ కొత్త చరిత్ర

105-Year-Old Woman Sets New 100m Record At-Athletics Championships - Sakshi

100 మీటర్ల పరుగు పందెంలో 105 ఏళ్ల రామ్‌బాయి కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన నేషనల్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో ఈ బామ్మ వంద మీటర్ల రేసులో భాగంగా 45.40 సెకన్లలోనే గమ్యాన్ని చేరింది. అయితే సమాచారం ప్రకారం ఈ రేసులో రామ్‌బాయి తప్ప మరెవరు పాల్గొనలేదంట. కేవలం 100 ఏళ్లు పైబడిన వారికే నిర్వహించిన రేసులో రామ్‌బాయి ఒక్కరే పాల్గొన్నారు. ఎవరు పోటీ లేకపోవడం.. తన రికార్డును తానే బద్దలు కొట్టి గమ్యాన్ని చేరిన రామ్‌బాయికి స్వర్ణ పతకం అందజేశారు.  


కాగా అదే రోజున నిర్వహించిన 200 మీటర్ల  స్ప్రింట్‌ను ఒక నిమిషం 52.17 సెకన్లలో గమ్యాన్ని అందుకొని స్వర్ణం సాధించడం విశేషం. కాగా 100, 200 మీటర్ల రేసులో విజయం సాధించిన తర్వాత రామ్‌బాయిని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో అభినందించారు. అనంతరం ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఇదే గుంపులో రామ్‌బాయి మనవరాలు.. అథ్లెట్‌ అయిన షర్మిలా సంగ్వాన్‌ కూడా ఉంది.

తన నానమ్మ విజేతగా నిలవడంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆమె మాట్లాడుతూ.. ''మా నానమ్మ విజయం మాకు గర్వకారణం. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఉదయాన్నే లేచి 3-4 కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తడం ఆమెకు అలవాటు. ఇది ఆమెను మరింత బలంగా తయారయ్యేలా చేసింది.'' అంటూ పేర్కొంది.

చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్‌.. రొనాల్డో క్షేమంగానే

Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్‌.. రాత్రిళ్లు నియోజకవర్గం పని

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top