గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
● పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ● నూతన సర్పంచ్‌లతో మంత్రి వివేక్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ పరిధిలోని సర్పంచ్, వార్డు మెంబర్లు మంత్రి వివేక్‌ను కలిశారు. గురువారం గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని హైదరాబాద్‌లో కలిసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంద పాండు తెలిపారు. నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు సదాశివరెడ్డి, మంద వనజ, తదితరులు ఉన్నారన్నారు.


