అధికారుల బృందం సీఓఈ సందర్శన
ములుగు(గజ్వేల్): మండల కేంద్రంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ), అచ్చాయిపల్లి ఏటీజీసీని ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి, ఆయా రాష్ట్రాలకు చెందిన ఉద్యాన అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతున్న వివిధ రకాల కూరగాయలు, నర్సరీల పెంపకం తీరును పరిశీలించారు. మొక్కల ఉత్పత్తి విధానంలో సాగుచేస్తున్న మామిడి, జామ, సీతాఫలం, నిమ్మలో పాటించాల్సిన మెలకువల గురించి జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి బృందానికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.


