ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
మిరుదొడ్డి(దుబ్బాక): రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మిరుదొడ్డి మండలంతో పాటు, అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమావళి నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో కరెంటు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ర్యాంపులు, మరుగుదొడ్లు, తాగు నీటి వసతి కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నెట్ కనెక్షన్ ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గంగుల గణేశ్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీఓ ఫహీం, ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలి
పోలింగ్ కేంద్రాల పరిశీలన
తొగుట(దుబ్బాక): ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి హైమావతి అధికారులను ఆదేశించారు. మండలంలోని గుడికందుల, పెద్ద మాసాన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.


