భారీ రోడ్‌షోలు.. ర్యాలీలు
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రచారానికి శుక్రవారం ఆఖరి రోజు కావడంతో అయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు భారీ రోడ్డు షోలు నిర్వహించారు. తమకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో సర్పంచ్ అభ్యర్థిగా బరీలో నిలిచిన కాముని మంజుల ఎన్నికల ప్రచారంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు. కాముని మంజులను గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు.


