బీజేపీతోనే పల్లెల అభివృద్ధి
మిరుదొడ్డి(దుబ్బాక): బీజేపీతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మిరుదొడ్డి సర్పంచ్‌గా బీజేపీ బలపర్చిన కానుగంటి స్వప్న శ్రీనివాస్ గెలుపు కోపం మిరుదొడ్డిలో బుధవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం లేని అభ్యర్థులకు ఓటేస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు నిధులు లేవన్న సాకుతో పాలన చేతకాక చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ల మల్లేశం, నాయకులు ఎల్లం, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


