ప్రచార హోరు.. ఆఫర్ల జోరు
న్యూస్‌రీల్
గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులంటున్న ఎంపీలు సొంత నిధులు సైతం వెచ్చిస్తామంటున్న అభ్యర్థులు గ్రామాల్లో పలువురిపై కేసులు ఏకగ్రీవాలపై రెవెన్యూ, పోలీసుల విచారణ
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఏకగ్రీవాల కోసం ప్రలోభాలు
గ్రామాల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవానికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా ఈ నెల 11, 14, 17వ తేదీల్లో జరగనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ పూర్తి అయ్యింది. రెండు విడతల్లో ఉప సంహరణలు ముగిశాయి. మూడో విడత మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏకగ్రీవాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటూ ప్రజా ప్రతినిధులు.. గ్రామాభివృద్ధికి సొంత నిధులను వెచ్చిస్తామంటూ అభ్యర్థులు ముందుగానే ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు 26 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా, పలు చోట్ల ఆఫర్లు బహిరంగంగా జరగడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. వీటిపై క్షేత్రస్థాయి అధికారులు విచారణ చేపడుతున్నారు.
– సాక్షి, సిద్దిపేట


