తోటి కోడళ్ల ‘పంచాయతీ’
తొగుట(దుబ్బాక): సర్పంచ్ పదవి కోసం తోటి కోడళ్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. రిజర్వేషన్లలో భాగంగా లింగంపేట సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. స్వయాన అన్నదమ్ములైన గొడుగు ఐలయ్య, గొడుగు నర్సింహులు తమ సతీమణులు యాదమ్మ, జయమ్మలను బరిలో దింపారు. దీంతో వారు ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్‌గా గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. మద్దతుగా నిలవాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు అన్నదమ్ముల మధ్య పోరు రసవత్తరంగా మారిందని పలువురు అంటున్నారు. గొడుగు యాదమ్మ 2006లో సర్పంచ్‌గా పనిచేశారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా నిర్మల్ గ్రామ పురస్కార్‌ను అందుకున్నారు. ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి తీరుతానంటూ జయమ్మ సైతం ఓటర్లను కోరుతున్నారు.


