కాంగ్రెస్ పాలనలోనే సమ న్యాయం
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆదివారం భూంపల్లి–అక్బర్‌పేట మండలం పోతారెడ్డిపేటలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఏపీ గీతాపారిశ్రామిక సంఘం మాజీ చైర్మన్ దివంగత బండి నర్సాగౌడ్ సతీమణి భాగ్యలక్ష్మి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన విజయవంతంగా చేపడుతున్నామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని వాటిని సరిచేస్తూ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
మంచి వారినే ఎన్నుకోవాలి
సర్పంచ్‌ల ఎన్నికల్లో సమర్థులైన మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు. అధికారపార్టీకి చెందిన వారిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓట్లు వేయాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకమన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సంయుక్త శ్రీధర్, నాయకులు కమలాకర్, మంద చంద్రసాగర్, బాల్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మధు, ప్రతాప్, బాల్తె వెంకటేశం తదితరులు ఉన్నారు.
గ్రామాభివృద్ధికి పాటుపడేవారినేఎన్నుకోండి
విజయవంతంగా ప్రజాపాలన
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్


