ఏకగ్రీవం@ 26
సిద్దిపేటరూరల్: జిల్లాలో మొదటి, రెండో విడతల్లో మొత్తం 26 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడతలో 16, రెండో విడతలో 10 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు అధికారికంగా ప్రకటించారు. మూడో విడత లెక్క మరో మూడు రోజుల్లో తేలనుంది. ఎన్నికల షెడ్యూల్ మేరకు మొదటి విడతలో 7 మండలాల్లో 163 గ్రామాల్లో, 1,432 వార్డుల్లో, అదేవిధంగా రెండో విడతలో 182 గ్రామాలు, 1,644 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. షెడ్యూల్ మేరకు ఆయా విడతల్లో 26 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా మిగతా స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ లెక్కన మొదటి విడత సర్పంచ్ స్థానానికి 481మంది, వార్డు సభ్యుల స్థానాలకు 2,972మంది పోటీలో నిలిచారు. అలాగే రెండో విడతలో జరిగే ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు 694 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 3,917 మంది పోటీలో ఉన్నారు. మొదటి విడత పోలింగ్ ఈనెల 11, రెండో విడతకు ఈనెల 14 పోలింగ్ ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆ దిశగా దృష్టి సారిస్తూ ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు.
రెండు విడతల్లో తేలిన లెక్క
సర్పంచ్ బరిలో 1,175మంది
మరో మూడు రోజుల్లో క్లారిటీ


