ఎన్నికల సిత్రం
ఇటు ప్రచారం..
అటు ఏకగ్రీవం
వర్గల్(గజ్వేల్): ఇంటి పక్కన ఇళ్లు.. కలిసిపోయినట్లున్న ఊర్లు.. చెట్టే గెట్టు అన్నట్లు ఆవలవైపు చాంద్‌ఖాన్ మక్త (మక్త మైలారం), చెట్టు ఈవలి వైపు చౌదరిపల్లి పరిధిలోకి వస్తుంది. వర్గల్ మండల పరిధిలోని ఈ రెండు గ్రామాలలో చాంద్‌ఖాన్ మక్త పంచాయతీ ఏకగ్రీవమైంది. దీంతో ఇక్కడ ఎన్నికల ప్రచారార్భాటం లేకుండాపోయింది. పక్కనే ఆనుకుని ఉన్న చౌదరిపల్లిలో పోటీ నెలకొన్నది. ఇక్కడ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. దీంతో మీకు ఓట్ల పండుగ, మాకు ఏమిలేకుండా పాయె అంటూ ఇరుగు, పొరుగు సరిహద్దు ఇళ్లవారు చర్చించుకుంటున్నారు.


