ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు
కోహెడరూరల్(హుస్నాబాద్): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అభిలాష్ తెలిపారు. గురువారం రాత్రి వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై భారీగా మద్యం తరలిస్తున్న మైసంపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రమేశ్, ఎట్టబోయిన శ్రీకాంత్ పట్టుపడ్డారు. వారిని విచారించగా గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యురాలిగా పోటీచేస్తున్న అభ్యర్థి తీసుకురమ్మన్నట్టు తెలిపారు. దీంతో వారిపై పంచాయతీ రాజ్, ఎకై ్సజ్, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
మరో ముగ్గురిపై..
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లెలగడ్డలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రవీందర్ ఎలాంటి అనుమతి లేకుండా తన వాహనాన్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించారు. అలాగే హుస్నాబాద్ నుంచి మల్లంపల్లికి అక్రమంగా మద్యం తరలిస్తున్న పబ్బ సంపత్‌పైనా, భల్లునాయక్‌తండాలో అక్రమంగా బీర్లు విక్రయించిన మహిళపైనా కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అనుమతి లేకుండా ప్రచారంలో వాహనాలు వినియోగించినా.. అక్రమంగా మద్యం తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


