సామాజిక సేవలో భాగస్వాములు కావాలి
గజ్వేల్‌రూరల్: విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సహకారం అందించి ఆదుకోవాలన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, నైతికత, బాధ్యతతో వ్యవహరించడం లాంటి విలువల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు స్వచ్ఛంద సేవ ప్రతిజ్ఞ చేశారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సౌజన్య, డాక్టర్ సరోజ, అధ్యాపకులు కస్తూరిబాయి, వీఆర్ అర్చన, డాక్టర్ శోభారాణి పాల్గొన్నారు.


