ఓటు కొనొద్దు.. అమ్మొద్దు..
సిటిజన్స్ క్లబ్‌ప్రదర్శన
గజ్వేల్: ‘అభ్యర్థులారా ఓటును కొనకండి – గ్రామస్తులారా ఓటును అమ్మకండి’ అనే నినాదంతో జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామంలో సిటిజన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో ప్రలోభాల ప్రభావం వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు ఎల్లు రాంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ప్రజల హక్కు, శక్తి, గౌరవం అని అభివర్ణించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు బట్టు దయానందరెడ్డి, రామకృష్ణారెడ్డి, కొన్యాల కిష్టారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, భిక్షపతి, వెంకట్‌రెడ్డి, యువజన సంఘాల నాయకులు రంగ వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు.


