పాఠశాలల సమస్యలపై ఆరా
విద్యాపరిరక్షణ కమిటీ పరిశీలన
గజ్వేల్: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై విద్యాపరిరక్షణ కమిటీ ఆరా తీస్తోంది. టీపీటీఎఫ్(తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్)కు చెందిన విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర బాధ్యులు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, వై.అశోక్‌కుమార్, ప్రకాశ్‌రావులు గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్‌లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పాఠశాలను బైఫర్‌కేషన్ చేసి ఖాళీగా ఉన్న తెలుగు, హిందీ ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వేణుగోపాల్, టీపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు రాజయ్య, రాష్ట్ర కౌన్సిలర్ రాజులు, నాయకులు ఎల్లయ్య, మధుమోహన్, గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు తాళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


