కాంగ్రెస్‌లోకి వర్గల్ మాజీ జెడ్పీటీసీ
వర్గల్(గజ్వేల్): బీఆర్‌ఎస్‌కు చెందిన వర్గల్ తాజా మాజీ జెడ్పీటీసీ మెంబర్ బాలమల్లు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌లో విలువలేకుండా పోయిందని, ఒంటెత్తుపోకడలతో విసిగి వేసారి తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ఈ సందర్భంగా బాలమల్లు యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి, ప్రభుదాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


