ప్రక్రియ సాగుతోంది..
పునరుద్ధరణ ప్రక్రియ కింద ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువులను ఎంపిక చేశాం. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. మురికి నీరు చెరువుల్లో కలవకుండా భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేశాం. చెరువుల్లో గుర్రపు డెక్క కు శాశ్వత పరిష్కారం అందుతుంది.
– ఆశ్రిత్, మున్సిపల్ కమిషనర్
ద్విముఖ లక్ష్యంగా..
ఇప్పటికే కోమటి చెరువు ఒక పర్యాటక స్థలంగా మారింది. ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువుల్లో మురికి నీటి విలీనం కాకుండా, స్వచ్ఛమైన నీటితో లేక్ ఉండేలా, ప్రజలకు ఆహ్లదకరం పంచేలా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో చెరువులు పర్యాటక ప్రాంతాలుగా మారనున్నాయి. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి.
– హరీశ్‌రావు, ఎమ్మెల్యే
ప్రక్రియ సాగుతోంది..


