సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
హుస్నాబాద్‌రూరల్: వర్షాలతో పంటలు దెబ్బతినకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలో పర్యటించి వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నేలవాలిన వరిని కట్టలు కట్టి నీటిలో వరి గొలుసులు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోతకు సిద్ధంగా ఉంటే లీటరు నీటిలో 5శాతం ఉప్పుద్రావం కలిపి చల్లాలని చెప్పారు. ఏరిన పత్తి పొడి ప్రదేశంలో ఆరబెట్టి నిల్వ చేయాలని సూచించారు. తడిపత్తినే కుప్పవేస్తే బూజు పట్టే ప్రమాదం ఉందన్నారు. అధిక తేమ ఉంటే కాయలు కుళ్లిపోతాయన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి


