అభివృద్ధి పనులు వేగిరం చేయండి
సిద్దిపేటజోన్: బల్దియాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల సూచించారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా మున్సిపల్ యంత్రాంగం చొరవ చూపాలన్నారు. బహిరంగ ప్రాంతాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. మున్సిపల్ వాహనాలకు చెత్త ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై రూపొందించిన ఏజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కమిషనర్ ఆశ్రిత్, కౌన్సిలర్లు సుందర్, యోగి, వినోద్, సాయి, మల్లికార్జున్, విఠోభ, రవి, బ్రహ్మం, రియాజ్, బాల్ లక్ష్మి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల


