హుస్నాబాద్‌లో సీఎం ఏరియల్ సర్వే
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025
● వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన ● రైతులను ఆదుకోవాలంటూసీఎంకు మంత్రి పొన్నం వినతి
హుస్నాబాద్: మోంథా తుపాన్‌కు దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో 42 సెం.మీ. వర్షపాతం, హుస్నాబాద్ మండలంలో 35 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వేలాది ఎకరాల పంటలు నీటి మునిగాయి. భారీ వరదతో వ్యవసాయ మార్కెట్ యార్డు, ఐకేపీ సెంటర్లలో వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ వ్యూ ద్వారా నీటి మునిగిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, కూలిన కల్వర్టర్లు, భారీ వరదలకు వ్యక్తులు గల్లంతైన ప్రదేశాలను సీఎం పరిశీలించారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
హుస్నాబాద్‌లో సీఎం ఏరియల్ సర్వే


