మక్కకు మొలకలు.. ఆవిరైన ఆశలు
రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన మక్క దిగుబడులతో గట్టెక్కుదామనుకున్న రైతులకు మోంథా తుపాన్ అశని పాతంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మక్క కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కుప్పల్లో మొలకలు వచ్చి రైతుల ఆశలను ఆవిరి చేసింది. నాణ్యత తగ్గడమే కాకుండా తేమ శాతం పెరగడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. వచ్చిన అరకొర దిగుబడులు సైతం తుపాను రూపంలో నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
– మిరుదొడ్డి(దుబ్బాక)
మక్కకు మొలకలు.. ఆవిరైన ఆశలు


