పాఠశాలే పానశాలగా..!
సిద్దిపేటరూరల్: మందుబాబులు పాఠశాలలే అడ్డాలుగా మార్చుకుని మందు సేవిస్తున్నారు. మండల పరిధిలోని రాఘవాపూర్ ప్రాథమిక పాఠశాల తరగతి ముందు రాత్రి వేళ మద్యం సేవించి తాగిన సీసాలు, గ్లాసులు అక్కడే వదిలేశారు. పాఠశాలలో ఉన్న సీసీ కెమెరాలను, మరుగుదొడ్ల డోర్లు, తరగతి గదుల కిటికీలను సైతం ఆకతాయిలు ధ్వంసం చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆకతాయిల ఆగడాలకు ఆడ్డు అదుపు లేకుండా పోతోంది. అర్ధరాత్రి వరకు పాఠశాల ప్రాంగణంలో మద్యం తాగుతూ ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
పాఠశాలే పానశాలగా..!


