సకాలంలో వైద్య సేవలందించండి
ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
కొండపాక(గజ్వేల్): సకాలంలో మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం అకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సేవల రిజిస్టరును, ల్యాబ్ గదిని, ఏఏ మందులు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ రాజీవ్ రహదారికి సమీపంలో ఆస్పత్రి ఉండటంతో డ్యూటీల వారీగా వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. వైద్యం అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేదిలేదన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న వివిధ సమస్యలను ఆయా శాఖల సమన్వయంతో నెరవేరేలా చూసుకోవాలని డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్‌కు ఫోన్ ద్వారా సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన తప్పనిసరి అన్నారు. అలాగే పారిశుద్ధ్యం విషయంలో సూచనలు చేశారు. మంగళవారం రోజు 50 మందికి పైగా వైద్యపరమైన సేవలందించడం, ఆయుష్ కేంద్ర నిర్వహణప సంతృప్తిని వ్యక్త పర్చారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీధర్, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


