మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి
భక్తజన నాచగిరి
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం భారీ సంఖ్యలో తరలిరావడంతో అలయ పరిసరాలు రద్దీగా మారాయి. పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 20వేల మంది దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ బండారు బొట్టు పెట్టడం, అభిషేక జలాలు చల్లడం, అఖండ హారతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలను అర్చకులు ప్రారంభించారు.
నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. హరిద్ర నది వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గర్భగుడిలో కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు. అభి షేకం, వ్రతం, కల్యాణాది మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. క్షేత్రంలో 15 వ్రతాలు, 10 అభిషేకాలు, 8 కల్యాణాలు జరి గాయి. ఆలయ యంత్రాంగం భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నది.
– వర్గల్(గజ్వేల్)
మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి
మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి
మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి


