దుబ్బాకటౌన్/బెజ్జంకి(సిద్దిపేట): ఉద్యమ కారులు, గాయకులకు గద్దర్ అవార్డులు వరించాయి. సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని భాస్కర ఆడిటోరియంలో గద్దర్ ఐకాన్– 2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయపోల్ మండలం కేంద్రానికి చెందిన కళాకారుడు దరువు అంజన్న, బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన బుర్ర సతీష్‌కు చేసిన సేవలకు గుర్తుగా అవార్డులు దక్కాయి. అవార్డులను శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల, టూరిజం శాఖ చైర్మన్ రమేష్‌రెడ్డి, ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా అందించారు.
పండుగలు సంస్కృతికి ప్రతీకలు
మిరుదొడ్డి(దుబ్బాక): లోక కల్యాణార్థం పల్లెల్లో నిర్వహించే పండుగలు సంస్క ృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొండాపూర్‌లో నిర్వహించిన నల్ల పోచమ్మ తల్లి, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి కలశంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొ ని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు భక్తి భావాన్ని కలిగి ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
భగీరథ మహర్షికి నివాళి
సంగారెడ్డి జోన్: భగీరథ మహర్షి దీక్షకు, సహనానికి ప్రతిరూపమని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్‌తో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనుకున్నది సాధించేంతవరకు ఎంతటి కష్టన్నైనా ఎదుర్కోవడంతో ఆయనను భగీరథుడిగా పిలుస్తారని తెలిపారు.

దరువు అంజన్నకు, బుర్ర సతీష్‌కు అవార్డులు