సబ్సిడీ గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ గోల్‌మాల్‌

Published Wed, Mar 12 2025 9:06 AM | Last Updated on Wed, Mar 12 2025 9:06 AM

సబ్సి

సబ్సిడీ గోల్‌మాల్‌

ఎస్సీ కార్పొరేషన్‌లో అక్రమాలు ● నేరుగా థర్డ్‌ పార్టీ పేరుతో చెల్లింపులు

ఎస్సీ కార్పొరేషన్‌లో అక్రమాలు వెలుగుచూశాయి. సబ్సిడీ పేరుతో రూ.కోట్లు స్వాహా చేశారు. అధికారి, కింగ్‌ బుక్‌స్టాల్‌ యజమాని, లబ్ధిదారుడు కుమ్మకై ్క బ్యాంకర్‌కు సంబంధం లేకుండానే సబ్సిడీ గోల్‌మాల్‌ చేశారు. థర్డ్‌ పార్టీ పేరుతో 34 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.1.20కోట్ల సబ్సిడీని విడుదల చేశారు. యూనిట్లను ఏర్పాటు చేయకుండానే సబ్సిడీ డబ్బులను ఆ ముగ్గురు పంచుకున్నారు. కాసులకు ఆశపడి సదరు ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా అధికారి మే, 2023 నుంచి సెప్టెంబర్‌ 2024 వరకు పనిచేసిన సమయంలో ఇష్టారాజ్యంగా సబ్సిడీలను విడుదల చేయడం గమనార్హం. థర్డ్‌ పార్టీ పేరుతో విడుదల చేసిన సబ్సిడీలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశోధన చేసింది. అనేక విషయాలు వెలుగు చూశాయి.

సాక్షి, సిద్దిపేట: జిల్లాలో 2020–21లో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 60శాతం సబ్సిడీతో ఎకానామిక్‌ సపోర్ట్‌ స్కీం కింద దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో 1,576 మంది దరఖాస్తు చేశారు. ఏప్రిల్‌ 2023లో 1,408 మందికి రూ 33.29కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో రూ.21.18కోట్లతో 781 గ్రౌండింగ్‌ అయ్యాయని, మరో 627 మంది లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రూ.12.11కోట్లు బ్యాంక్‌లో ఉన్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

నేరుగా సబ్సిడీ విడుదల

గతంలో పని చేసిన ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా అధికారి.. కింగ్‌ బుక్‌స్టాల్‌ యజమాని, లబ్ధిదారులు కలిసి సబ్సిడీ డబ్బులు పంచుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌లో రుణం కోసం దరఖాస్తు దారుడు ఏర్పాటు చేసే యూనిట్‌కు సంబంధించి వివరాలతో బ్యాంక్‌ను సంప్రదించాలి. అప్పుడు బ్యాంక్‌ అధికారులు దరఖాస్తు దారుని వివరాలు పరిశీలించి రుణం మంజూరు చేయాలనుకుంటే బ్యాంక్‌ కాన్సెంట్‌ ఇస్తారు. ఆ పత్రాన్ని ఎస్సీ కార్పొరేషన్‌లో అందజేయాలి. అప్పుడు యూనిట్‌కు సంబంధించి సబ్సిడీని బ్యాంక్‌కు విడుదల చేస్తారు. అలా నిబంధనలు ఏమీ పాటించకుండానే ఇష్టారాజ్యంగా సబ్సిడీని నేరుగా అందించారు.

34 మందికి రూ.1.2కోట్లు విడుదల గతంలో పనిచేసిన అధికారి చేతివాటం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్న దళిత సంఘాలు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధనలో వెలుగు చూసిన నిజాలు

ఉన్నతాధికారులకు నివేదిక

యూనిట్‌ ఏర్పాటు చేస్తున్న వారికే సబ్సిడీని విడుదల చేయాలి. కానీ థర్డ్‌ పార్టీ పేరుతో సబ్సిడీని విడుదల చేయవద్దు. వివిధ యూనిట్‌లకు సంబంధించి నేరుగా గతంలో పని చేసిన అధికారి సబ్సిడీ విడుదల చేశారని తెలియడంతో ఉన్నత అధికారులు రిపోర్ట్‌ తెప్పించుకున్నారు. – రామాచార్య,

ఇన్‌చార్జ్‌ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌

సబ్సిడీ గోల్‌మాల్‌ 1
1/2

సబ్సిడీ గోల్‌మాల్‌

సబ్సిడీ గోల్‌మాల్‌ 2
2/2

సబ్సిడీ గోల్‌మాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement