భూసేకరణ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ పూర్తి చేయాలి

Mar 8 2025 7:56 AM | Updated on Mar 8 2025 7:56 AM

భూసేకరణ పూర్తి చేయాలి

భూసేకరణ పూర్తి చేయాలి

కలెక్టర్‌ మనుచౌదరి

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ ప్రాంతంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్‌ కాల్వలు, రంగనాయకసాగర్‌ నుంచి కోహెడ మండలంలోకి వచ్చే కెనాల్‌ కాల్వల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయలంలో భూసేకరణపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం గుండా జాతీయ రహదారి వెళ్తోందని, రోడ్డు పనులు ఆగిన చోట భూసేకరణ సమస్య పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం భూములను గుర్తించాలనని అదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రాంమూర్తి, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి ఉన్నారు.

ఎఫ్‌బీఓ రోల్‌ మోడల్‌గా నిలవాలి

అక్కన్నపేట(హుస్నాబాద్‌): ప్రసిద్ధ ఎఫ్‌బీఓ అందరికీ ఒక రోల్‌ మోడల్‌గా నిలవాలని కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రసిద్ధ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో, డైరెక్టర్లు,అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఏం పంటలు పండిస్తున్నారనే విషయాలను తెలుసుకొని రాష్ట్రంలో వివిధ మార్కెట్‌లో ధరలను గురించి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు గుర్తించి మనం ఎలాంటి పంటలను ఎగుమతి చేయాలనే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. అలాగే మండలంలోని అంతకపేట జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. పాఠశాలల్లో నిర్మాణ్‌ సంస్థ సౌజన్యంతో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న కంప్యూటర్‌ ల్యాబ్‌ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పదోవ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్‌ అనంతరెడ్డి, ఎంపీడీవో బానోతు జయరామ్‌, వ్యవసాయ అధికారి సుల్తానా, ఎంఈవో గుగులోతు రంగనాయక్‌ పాల్గొన్నారు.

పరీక్షలంటే భయం వద్దు

డీఐఈఓ రవీందర్‌రెడ్డి

దుబ్బాకటౌన్‌: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. అనంతరం దుబ్బాక మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల వేళ తమ విలువైన సమయాన్ని వృథా చేయవద్ధని సూచించారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించిన మైనార్టీ కళాశాలకు చెందిన భానుప్రసాద్‌, సుభాష్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు దేవయ్య, కస్టోడియన్‌ శివకుమార్‌, మైనారిటీ కళాశాల ఉపాధ్యాయులు, వార్డెన్‌ హమీద్‌, తదితరులు పాల్గొన్నారు.

మహిళల సాధికారతలేనిదే

అభివృద్ధి లేదు: రంగనాథ్‌

కొమురవెల్లి(సిద్దిపేట): మహిళల స్థితి గతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్‌ అధికారి రంగనాథ్‌ అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏంఈవో రమేశ్‌తో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సమాజ నిర్మాణంలో సగభాగమైన మహిళ సమానత్వమే మన ప్రగతికి మూలాధారమన్నారు. అనంతరం పాఠశాలోని మహిళ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్‌, మధ్యాహ్న భోజన కార్మికులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ లావణ్య, ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు కరుణశ్రీ,, సత్యానారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement