దుబ్బాకటౌన్: మేలైన యాజమాన్య పద్ధతులతో పొద్దు తిరుగుడు సాగులో అధిక దిగుబడులు పొందవచ్చని తోర్నాల వ్యవసాయ పరిశోధన క్షేత్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీదేవి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం మంతూర్‌లో పొద్దుతిరుగుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పొద్దుతిరుగుడు పంటను పరిశీలించారు. కార్యక్రమానికి భారతీయ నూనె గింజల పరిశోధన ప్రధాన శాస్త్రవేత శ్రీనివాస్, రాజేంద్రనగర్, కోయంబత్తూర్ శాస్త్రవేత్తలు శశికళ, సెంథిల్, రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి కవిత, మంతూర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.