
సమావేశంలో మాట్లాడుతున్న మల్లారెడ్డి
జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి
చేర్యాల(సిద్దిపేట): త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జహంగీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణ కేంద్రంలోని కార్యాలయంలో ముస్త్యాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించేందుకు చేర్యాల ప్రాంత కార్యకర్తలందరూ కదలిరావాలన్నారు. దేశ వ్యాప్తంగా మతోన్మాదాన్ని నింపుతున్న బీజేపీని అభ్యర్థులను ఓడించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు పాల్గొన్నారు.