
హుస్నాబాద్ పట్టణంలో నామినేషన్ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ
బీఆర్‌ఎస్ అభ్యర్థి సతీశ్‌కుమార్
హుస్నాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష అని పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా ఐఓసీ కాంప్లెక్స్‌కు తరలి వెళ్లారు. అంతకుముందు ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తల్లిదండ్రుల దీవెనలు తీసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులన్నారు. నాడు కేసీఆర్, ప్రజానీకం, యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతుంటే తెలంగాణ వచ్చేదా చచ్చేదా అని హేళన చేసినవారు ఇప్పుడు వచ్చి మేము అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
రూ.9,500 కోట్లతో అభివృద్ధి
తొమ్మిదేళ్లలో నియోజకవర్గాన్ని రూ.9,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఘననీయంగా అభివృద్ధి చేశానని సతీష్‌కుమార్ తెలిపారు. అన్ని గ్రామాల్లో రహదారులు, అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, తాగునీరు, చెరువుల మరమ్మతులు ఇలా అనేకం చేశామన్నారు. అభివృద్ధిని చూసి మరోసారి గెలిపించాలని కోరారు.

ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్