కాంగ్రెస్‌ గెలిస్తేనే అభివృద్ధి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గెలిస్తేనే అభివృద్ధి

Published Thu, Nov 9 2023 5:56 AM

హుస్నాబాద్‌ పట్టణంలో  కాంగ్రెస్‌ శ్రేణుల భారీ ర్యాలీ.. - Sakshi

హుస్నాబాద్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: కాంగ్రెస్‌ గెలుపు అభివృద్ధికి మలుపు అని పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం నామినేషన్‌ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకముందు పొన్నం దంపతులు పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయం, ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రచారరథంపై మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌లుతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గౌరవెల్లి ప్రాజెక్టును కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ పార్టీ అడ్డుపడిందని ఆరోపిస్తున్న కేసీఆర్‌ ఇక్కడి ప్రజలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ అసమర్థత వల్లే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. తాను గెలిస్తే హుస్నాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇదిలా ఉంటే.. హుస్నాబాద్‌లోని సింగిరెడ్డి అమరుల భవన్‌లో బుధవారం పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సీపీఐ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

1/1

 
Advertisement
 
Advertisement