బాలుడు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

బాలుడు అదృశ్యం

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

పటాన్‌చెరు టౌన్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని సాయిరాంనగర్‌ కానికి చెందిన బాలుడు(17) ఇంట్లో గేమ్‌ ఆడుతున్నాడని మంగళవారం తండ్రి మందలించాడు. దీంతో బుధవారం ఉదయం కిరణ షాప్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బాలుడి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది.

చికిత్స పొందుతూ

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గజ్వేల్‌రూరల్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని జాలిగామ రింగురోడ్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి పడిఉన్నట్లు స్థానికులు బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని అంబులెన్స్‌లో గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు సిద్దిపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వయసు 46ఏళ్లు ఉండవచ్చని, మృతుడిని ఎవరైనా గుర్తు పడితే 8712667460 నంబరులో సంప్రదించాలని గజ్వేల్‌ పోలీసులు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement