● వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రారంభం
● జహీరాబాద్‌లో రూ.2వేల కోట్లపెట్టుబడులు
జహీరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 10న రాష్ట్రానికి వస్తున్నందున జహీరాబాద్‌కు మంజూరైన గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్మార్ట్ సిటీకి పర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న 12 గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్లలో ఒకటి తెలంగాణలోని జహీరాబాద్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు గాను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా జహీరాబాద్ ప్రాంతంలో సుమారు 10లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది.


