వ్యవసాయ శాస్త్రవేత్త పల్లవి
దుబ్బాకటౌన్: పంటల మార్పిడితోనే అధిక దిగుబడులు సాధ్యమని వ్యవసాయ శాసర్తవేత్తలు పేర్కొన్నారు. శుక్రవారం వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రాయపోల్ మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట, వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్.పల్లవి, డాక్టర్ డి. శ్వేత మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని, పంట మార్పిడి పాటించడం ద్వారా స్థిర ఆదాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమేశ్, వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, స్వర్ణలత, ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.


