శభాష్‌ పోలీస్‌ | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ పోలీస్‌

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

● చెరువులో దూకిన వృద్ధురాలు

● స్థానికుల సహాయంతో కాపాడిన పోలీసులు

మిరుదొడ్డి(దుబ్బాక): కుటుంబ కలహాలతో ఓ వృద్ధురాలు చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో వృద్ధురాలిని ఒడ్డుకు చేర్చారు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన 70 సంవత్సరాల వయస్సు గల చింతమడక లచ్చవ్వ కుటుంబ కలహాలతో సతమతం అవుతుండేది. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళుతున్న హనుమాన్‌ భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బ్లూ కోడ్స్‌ పోలీసులు రాజు, బాబు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో అతి కష్టంపై లచ్చవ్వను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు సీపీఆర్‌ చేసి స్పృహలోకి తెచ్చారు. కొన ఊపిరితో ఉన్న లచ్చవ్వను 108 ద్వారా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సకాలంలో స్పందించి వృద్ధురాలిని కాపాడిన బ్లూ కోడ్స్‌ పోలీసులను గ్రామస్తులు శభాష్‌ పోలీస్‌ అంటూ అభిందించారు.

Advertisement
 
Advertisement
Advertisement