షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

రూ.8 లక్షల ఆస్తి నష్టం

అల్లాదుర్గం(మెదక్‌): షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ ఇల్లు దగ్ధమై రూ.8 లక్షల 42 వేల ఆస్తి నష్టం జరిగిన సంఘటన అల్లాదుర్గం మండల పరిధిలోని సీతానగర్‌లో చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య పెంకుటిళ్లు ఉండగా.. కొత్తగా ఇళ్లు కట్టుకుంటుండగా మరో గదిలో ఉంటున్నారు. గురు వారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో ఫ్రిజ్‌లో మంటలు చెలరేగి ఇళ్లు దగ్ధమైనట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల 20 వేలు నగదు, రెండున్నర తులాల బంగారం, 20 తులాల వెండి అభరణాలు, బియ్యం, పప్పుదినుసులు, దుస్తులు, టీవీ, వ్యవసాయ సామగ్రి, ఇతర వస్తువులు అగ్నికి కాలిపోయినట్లు తెలిపారు. తహసీల్దార్‌ మల్లయ్య, ఆర్‌ఐ ఫిరోజ్‌లు విచారణ చేపట్టారు. కాగా, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని బాధితుడు నాగయ్య కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement