రామచంద్రాపురం(పటాన్‌చెరు): కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్‌లో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ సర్కిల్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని రాత్రి కొల్లూరు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మృతి చెందిన వ్యక్తి వయస్సు 30ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలిపారు. మృతిడి ఒంటిపై ఎరుపు రంగు టీషర్టు, నీలిరంగు జీన్స్‌ప్యాంట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతిడి ఆచూకీ ఎవరికై నా తెలిస్తే కొల్లూరు పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.


