నందిగామలో యువతి..
పటాన్‌చెరు టౌన్: బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశం వివరాల ప్రకారం... పటాన్‌చెరు మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన లకీ్‌ష్మ్‌నారాయణ ప్రవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కూతురు రుచిత (19) ఇంటర్ వరకు చదివి, బ్యూటీషన్ నేర్చుకొని ఈవెంట్స్ చేస్తుంది. మూడు రోజుల క్రితం వరంగల్‌లో ఈవెంట్ ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంత దూరం వద్దన్నారు. ఈ క్రమంలో గత నెల 30న రామచంద్రపురంలో ఉండే స్నేహితురాలు దగ్గర ఈవెంట్‌కు సంబంధించిన మెటీరియల్ ఉందని.. తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంగయపేటలో వ్యక్తి..
కౌడిపల్లి(నర్సాపూర్): కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన వ్యక్తి అదృశ్యమైయ్యాడు. శుక్రవారం ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలంలోని సంగయపేటకి చెందిన పాలంచ మల్లయ్య(58) కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 27వ తేదిన కౌడిపల్లి మండలం తునికి నల్లపోచమ్మదేవి ఆలయానికి వచ్చాడు. కుటుంబ సభ్యులు ఆలయం వద్ద స్నానం చేసేందుకు వెళ్లగా.. అప్పటి నుంచి అతను కనిపించలేదు. ఆలయ పరిసరాలతోపాటు బంధువుల వద్ద వెతికిన అతని ఆచూకీ లభించలేదు. అయితే మల్లయ్యకు మానసిక స్థితి సరిగా లేక అప్పుడప్పుడు ఇంటినుంచి వెళ్లి తిరిగి వచ్చేవాడని చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.


