సమ్మెకు దిగిన మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు దిగిన మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

జహీరాబాద్‌ టౌన్‌: తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల పెండింగ్‌ పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బులు జమచేయాలని కోరుతున్న అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో జమచేయాలని, ఎండల కారణంగా ఒంటిపూట పని కల్పించాలని కోరారు. ఈ సమ్మెలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సంజీవ్‌, మోహన్‌, యశోదమ్మ, సిద్ధమ్మ కార్మికులు పాల్గొన్నారు.

సమస్యలపై నిరసన

Advertisement
 
Advertisement
Advertisement