పటాన్‌చెరు టౌన్: పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు శుక్రవారం ట్రాఫిక్ సీఐ అశోక్, ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా సైలెన్సర్లు మార్చి, కాలుష్యం కలుగజేస్తున్న ఏడు వాహనాలను గుర్తించి, మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానా విధించారు. అలాగే సైలెన్సర్లను తొలగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ అశోక్ మాట్లాడుతూ వాహనదారులు ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ధ కాలుష్యం సృష్టిస్తే సహించమన్నారు. ఆ వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రాఫిక్ సీఐ అశోక్


