రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

కల్హేర్‌(నారాయణఖేడ్‌): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని మాసాన్‌పల్లి, నిజాంపేట్‌ మండలం నాగధర్‌, బాచేపల్లిలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం విక్రయించేందుకు నాణ్యత పాటించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. అనంతరం బాచేపల్లిలో సీసీ రోడ్డు, మంచినీటి పథకం బోరు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్‌ భాస్కర్‌సేట్‌, ఏపీఎం వంశీకృష్ణ, సర్పంచ్‌లు కుర్మ సాయిలు, జక్కరయ్య, నాయకులు పత్తిగారి శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement